తెలంగాణలో అతిపెద్ద రైల్వేస్టేషన్ సికింద్రాబాద్ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.రూ.719 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.కొత్త టెక్నాలజీతో పనులు జరుగుతున్నాయన్నారు.
పార్కింగ్ స్థలం, బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.రైల్వేస్టేషన్ ఎత్తు 15 మీటర్లు పెంచాలని చూస్తున్నామని వెల్లడించారు.
కోచ్ నెంబర్స్, సైన్ బోర్డులు కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పనులు సాగుతాయన్నారు.
సికింద్రాబాద్ -విజయవాడ వందే భారత్ ట్రైన్ తీసుకొస్తున్నామని వెల్లడించారు.దానిని తిరుపతి వరకూ పొడిగించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
సిద్ధిపేటకు కొత్త రైలు ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.







