Allu Arjun Fans Protest: అప్డేట్ కోసం గీతా ఆర్ట్స్ ముందు బన్నీ ఫ్యాన్స్ ధర్నా.. మరీ ఇంత వైలెంట్ గా ఉన్నారేంటి?

కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాల కోసం ఎంతగా రచ్చ చేస్తారు చూస్తూనే ఉంటాం.తమ హీరో సినిమా విడుదలవుతుంది అంటే చాలు.

 Allu Arjun Fans Protest Infront Of Geetha Arts Office For Pushpa 2 Update Detail-TeluguStop.com

కొన్ని రోజుల ముందే థియేటర్ల దగ్గర సందడి చేస్తూ ఉంటారు.ఏదైనా సినిమా గురించి అనౌన్స్ చేస్తే మాత్రం ఆ సినిమా విడుదలయ్యే వరకు అప్ డేట్ కోసం దర్శక నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు.

ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాల కోసం నానా రకాలుగా రచ్చ చేశారు.అలా తాజాగా బన్నీ ఫ్యాన్స్ కూడా ఏకంగా అప్ డేట్ కోసం గీత ఆర్ట్స్ ముందు ధర్నా చేశారు.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదాకు చేరాడు.ఈయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.ఇక ఇటీవలే పాన్ ఇండియా మూవీ పుష్ప లో నటించి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఈ సినిమా విడుదల కావడంతో.

ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు కూడా ఈయనకు అభిమానులుగా మారారు.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Bunny Fans, Dharna Geetha, Sukumar, Geetha,

ఇక పుష్ప 2 కూడా ఉంటుందని గతంలో తెలిపిన సంగతి తెలిసిందే.పైగా ఆ సినిమా గురించి కూడా గతంలో కొన్ని విషయాలు తెలిపారు.కానీ ఇప్పటివరకు మళ్ళీ ఆ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు.

దీంతో బన్నీ అభిమానులు రంగంలోకి దిగారు.పుష్ప 2 అప్ డేట్స్ హైదరాబాద్ లోని గీత ఆర్ట్స్ ఆఫీస్ ముందు బన్నీ అభిమానులు ధర్నాకు దిగారు.

ఇక ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఒకవైపు అభిమానులు అప్ డేట్ కోసం ఇంతలా రచ్చ చేస్తుంటే.మరోవైపు బన్నీ తన ఫ్యామిలీతో సౌత్ ఆఫ్రికాలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.అయినా కూడా అల్లు అర్జున్ లేకున్నా కూడా పుష్ప 2 షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలిసింది.

కానీ ఈ సినిమా గురించి అప్డేట్ కావాలి అంటూ బన్నీ ఫాన్స్ మాత్రం ఆఫీస్ ముందర బాగా నినాదాలతో రచ్చ చేస్తున్నారు.పార్ట్ 1 విడుదలై సంవత్సరం అవుతుంది.

కానీ పార్ట్ 2 గురించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదని వాపోతున్నారు.

Telugu Allu Arjun, Allu Arjun Fans, Bunny Fans, Dharna Geetha, Sukumar, Geetha,

కనీసం సినిమా సెట్స్ మీదికి వెళ్లినట్లు కూడా అధికారంగా ప్రకటించకపోవడంతో అభిమానులు మరింత ఫైర్ అవుతున్నట్లు తెలిసింది.ప్రస్తుతం ఈ విషయం మాత్రం బాగా వైరల్ గా మారగా.ఈ రచ్చ అంత చూసిన నెటిజన్స్ బన్నీ ఫ్యాన్స్ ఏంటి ఇంత వైలెంట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరీ దీని గురించి అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి ఏమని సమాధానం ఇస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube