కెనడాలో స్థిరపడిన విదేశీ వలసదారులు ఇప్పటికే అక్కడ పలు రంగాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.అయితే ఆ దేశ సాయుధ బలగాల్లోకి మాత్రం ఎంట్రీ కష్టం.
దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో ఇన్నాళ్లు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం వెనుకాడింది.ఈ నేపథ్యంలో కెనడా సాయుధ బలగాలు (సీఏఎఫ్) కీలక ప్రకటన చేశాయి.
ఇకపై దేశంలో స్థిరపడి, పర్మినెంట్ రెసిడెన్స్ స్టేటస్ వున్న విదేశీయులు మిలటరీలో చేరొచ్చని తెలిపింది.దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో శాశ్వత నివాస హోదా వున్న భారతీయులకు ప్రయోజనం కలిగే అవకాశం వుంది.
అయితే అత్యంత కీలకమైన ఈ రంగంలోకి విదేశీయులకు అనుమతి ఇవ్వడంపై కెనడాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే దీనికి కారణం లేకపోలేదు.అక్కడి ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలను మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.ఈ క్రమంలో కెనడా తమ దేశంలోకి వలసలను తీవ్రంగా ప్రొత్సహిస్తోంది.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 4 లక్షల మందికి శాశ్వత నివాస హోదా కల్పించింది.అంతేకాదు వచ్చే రెండేళ్లలో పది లక్షలకు పైగా విదేశీయులకు పర్మినెంట్ రెసిడెన్స్ కల్పించాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే వీరికి దేశ సాయుధ బలగాల్లో చేరే అవకాశం కల్పించింది.
శాశ్వత నివాసితులు గతంలో స్కిల్డ్ మిలటరీ ఫారిన్ అప్లికెంట్ (ఎస్ఎంఎఫ్ఏ) ప్రవేశ కార్యక్రమం కింద మాత్రమే అర్హులు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ (డీఎన్‌డీ) .త్వరలోనే కొత్త విధానానికి సంబంధించి అధికారిక ప్రకటన చేయొచ్చని మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఈ ఏడాది మార్చిలో కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్ మాట్లాడుతూ.ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో మారుతున్న ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్ధితుల మధ్య సీఏఎఫ్ ఎదగాల్సిన అవసరం వుందన్నారు.
తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే సీఏఎఫ్ వేల సంఖ్యలో ఖాళీగా వున్న స్థానాలను భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ అవసరాన్ని తెలిపింది.

ఇకపోతే.కెనడియన్ సైనిక బలగాల్లో మహిళలు 16.3 శాతం, స్థానిక ప్రజలు 2.7 శాతం, మైనారిటీ కెనడియన్లు 12 శాతం కంటే తక్కువగా వున్నారు.అయితే ర్యాంక్ స్థాయి అధికారుల్లో మూడొంతుల మంది శ్వేతజాతీయులే.
అలాగే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ కూడా కెనడాలో పదేళ్లుగా నివసిస్తున్న శాశ్వత నివాసితులు దరఖాస్తు చేసుకోవడానికి ‘‘పాత రిక్రూట్‌మెంట్ ప్రక్రియ’’ను మారుస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.