Nikhil 18 pages : అక్కడ వద్దు అంటున్న నిఖిల్.. క్రేజ్ ను కోల్పోకూడదనే ఈ నిర్ణయం!

కార్తికేయ 2 పేరు దేశం అంతటా మారుమోగి పోయింది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా కార్తికేయ 2.

 Nikhil Siddharth 18 Pages Movie Latest Update, 18 Pages Movie, Nikhil Siddharth,-TeluguStop.com

నిఖిల్ కెరీర్ లోనే కార్తికేయ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇక దీనికి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 ఇటీవలే రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా పార్ట్ 1 కంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది.చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులను సైతం మెప్పించి అక్కడ కూడా బాగా వసూళ్లు రాబట్టింది,ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ లో వండర్ క్రియేట్ చేసింది.

దీంతో నిఖిల్ కు పాన్ ఇండియా వ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది.ఇక కార్తికేయ 2 సినిమా హిట్ వల్ల నిఖిల్ నెక్స్ట్ చేస్తున్న సినిమాలపై కూడా మంచి క్రేజ్ ఏర్పడడంతో బాగా బిజినెస్ జరుగుతుంది.

ప్రెజెంట్ నిఖిల్ పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు.

అందులో 18 పేజెస్ సినిమా కూడా ఉంది.

ఈ సినిమాను కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తున్నాడు.

అలాగే గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.అసలైతే ఈ సినిమా కార్తికేయ కంటే ముందే రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

దీంతో ఈ సినిమాకు ఇప్పుడు కలిసి వస్తుంది అనే చెప్పాలి.

Telugu Pages, Nikhil Latest, Karthikeya, Nikhilsiddharth-Movie

ఎందుకంటే కార్తికేయ 2 హిందీలో మంచి వసూళ్లు రాబట్టడంలో ఇప్పుడు బాలీవుడ్ డిస్టిబ్యూటర్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకునేందుకు ఒత్తిడి చేస్తున్నారట.కానీ నిఖిల్ మాత్రం 18 పేజెస్ హిందీలో వర్కౌట్ కాదు అని.కార్తికేయ 2 తో వచ్చిన ఇమేజ్ ను కోల్పోకూడదు అని దానిని స్పై సినిమాతోనే నిలబెట్టుకోవాలని సూచిస్తున్నాడట.కానీ నిర్మాతలు మాత్రం వారి ఆఫర్ కు టెంప్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది.చూడాలి మరి నిఖిల్ 18 పేజెస్ హిందీలో రిలీజ్ అవుతుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube