అరబ్బు దేశాలలో కార్మికులుగా పనిచేసేందుకు వెళ్ళే వారిలో అత్యధిక శాతం మంది భారతీయులే ఉంటారు.వీరిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచీ వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉండగా, ఇందులో అత్యధికశాతం మంది యువకులు ఉంటడం గమనార్హం.
స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లేకనో లేదా చదువు పూర్తవగానే ఉద్యోగం సంపాదించి డబ్బు బాగా సంపాదించిన తరువాత తిరిగి సొంత ఊర్లకు వచ్చి స్థిరపడాలనో లేదా మరే ఇతరాత్రా కారణాల వలన అరబ్బు దేశాలు వెళ్తుంటారు, ఇలా వలసలు వెళ్ళే యువకులలో అత్యధికులు పెళ్లి కాని వారే ఉంటారు.అయితే అరబ్బు దేశమైన కువైట్ ఇలాంటి బ్యాచిలర్స్ అందరికి బిగ్ షాక్ ఇస్తోంది.
కువైట్ లోని పర్వానియా ప్రాంతంలో ఉన్న కొన్ని అపార్ట్మెంట్స్ లో ఉంటున్న బ్యాచిలర్స్ రూమ్స్ కి కరెంట్ కనక్షన్ లు తీసేస్తున్నారు స్థానిక అధికారులు.విద్యుత్, నీరు, ఇంధన మంత్రిత్వశాఖకు చెందిన న్యాయ నియంత్రణ విభాగంలోని ఓ కమిటి గడిచిన కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలోని అపార్ట్మెంట్స్ లో ఉంటున్న బ్యాచిలర్స్ రూమ్స్ కి అన్ని సరఫరాలు నిలిపివేస్తున్నారు.
ఆ ప్రాంతం మొత్తం జల్లెడ పడుతూ ఈ సోదాలలో బ్యాచిలర్స్ ఉంటే వెంటనే చర్యలు చేపడుతున్నారు.

గడిచిన 5 నెలలుగా ఇలా అధికారులు తనికీలు చేసి సుమారు 100 అపార్ట్మెంట్స్ కు విధ్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.దాంతో సదరు అపార్ట్మెంట్ కమ్యూనిటీ వాళ్ళు బ్యాచి లర్స్ ను ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా హుకుం జారీ చేస్తున్నారట.బ్యాచిలర్స్ కు అద్దెకు ఇచ్చే అపార్ట్మెంట్ లకు విద్యుత్ కనెక్షన్స్ తీసేస్తామని, బ్యాచిలర్స్ కు అద్దెకు ఇవ్వవద్దని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేసారట.
ఈ హెచ్చరికలను పట్టించుకోని వారిపైనే చర్యలు చేపడుతున్నామని అంటున్నారు అధికారులు కాగా అసలు ఎందుకు ప్రవాస బ్యాచిలర్స్ పైనే ఈ చర్యలు తీసుకుంటున్నారంటే అపార్ట్మెంట్ కమ్యూనిటీ లలో కుటుంబాల భద్రతా, ఆరోగ్యం, మరేఇతరాత్రా ముప్పు వాటిల్లకుండా ఉండాలని అలాగే పలు అపార్ట్మెంట్ కుటుంబాల నుంచీ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లుగా అధికారులు ప్రకటించారు.అయితే ఈ నిర్ణయం ప్రవాస బ్యాచిలర్స్ కు తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తోంది.







