Peethala Sujatha Chandrababu : కీలక నియోజకవర్గంపై కన్నేసిన టీడీపీ మాజీ మంత్రి

టీడీపీ సీనియర్ నాయకురాలు పీతల సుజాత కీలక నిర్ణయం తీసుకున్నారు.  20 ఏళ్లుగా టీడీపీ పార్టీలో కొనసాగుతున్నా సుజాత 2004లో తొలిసారిగా ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపోందారు.   2014 ఎన్నికల్లో  నియోజకవర్గం మారాల్సి వచ్చింది.2014లో ఆచంట జనరల్ నియోజకవర్గం కావడంతో ఆమె చింతలపూడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది.అయితే, ఆమె పని వివాదనంలో ప్రజలకు నచ్చకపోవడంతో 2019 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు.  స్థానిక కేడర్‌తో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో కూడా ఆమె విఫలమయ్యారు.దీంతో ఆమె 2019లో మంత్రివర్గంతోపాటు టికెట్ కూడా కోల్పోయింది.

 Former Tdp Minister Peethala Sujatha Looking For Constituency , Tdp, Peethala S-TeluguStop.com

పార్టీ టికెట్ నిరాకరించినప్పటికీ ఆమె పార్టీలోనే కొనసాగారు.ఆమె 2024లో మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారు.

చింతలపూడిలో క్యాడర్ ఇప్పటికీ ఆమెకు సానుకూలంగా లేకపోవడంతో, ఆమె  మరో నియోజకవర్గం గోపాలపట్నం నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అయితే గోపాలపట్నంలో ఇప్పటికే ఓ ఇన్ చార్జి ఉన్నారు.

దీంతో, ఆమెకు భవిష్యత్తు అంధకారమే.
 

Telugu Chandrababu, Chintalapudi, Constituency, Gopalapatnam-Political

టిక్కెట్టు రాకుంటే సుజాత మరో పార్టీ మారుతారా? లేక రాజకీయాల్లో నుండి తప్పుకుంటారో చూడాలి.ఫిరాయింపుల సమయంలో కూడా తన పార్టీ మారకుండా టీడీపీ అట్టుపెట్టుకుని ఉన్నందుకు చంద్రబాబు ఆమెపై తన విధేయతను ఎలా చాటుకుంటారో చూడాలి.పీతల సుజాతతో పాటుగా టీడీపీలో చాలా మంది నేతల పరిస్థితి ఈవిధంగానే ఉంది.2024లో ఎలాగైన అధికారంలోకి రావాలనుకుంటున్న టీడీపీ అభ్యర్థుల విషయంలో అచుతూచి వ్వవహరిస్తుంది.దీంతో ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే భీ పామ్ ఇవ్వాలనుకుంటున్నారు.

  స్పెషల్ టీమ్ లతో అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నారు.   వాటి అధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మరి టీడీపీ ప్రయాత్నాలు పలిస్తాయా? 2024లో తిరిగి పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube