జాతీయ రాజకీయాల్లో దూకుడు పెంచేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమైయ్యారని తెలుస్తోంది.బీఆర్ఎస్ విస్తరణ, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కేసీఆర్ దృష్టి సారించారు.
ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ భవన్ లో కీలక సమావేశం ఏర్పాటు కానుంది.జాతీయ రాజకీయ పరిణామాలే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరగనుంది.
శాసనసభ, పార్లమెంటరీ పక్షాలు, రాష్ట్ర కార్యవర్గంతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారని సమాచారం.ఈ నేపథ్యంలో కేసీఆర్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే పలు కీలక అంశాలు తెరపైకి తీసుకువచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.







