మాస్ మహా రాజా రవి తేజ హీరో గా సూపర్ హిట్ కమర్షియల్ సక్సెస్ దక్కించుకుని సంవత్సరం అవుతుంది.ఈ సంవత్సరం ఖిలాడి మరియు రామారావు ఆన్ డ్యూటీ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా అవి పెద్దగా వర్కౌట్ అవ్వ లేదు.
క్రాక్ సినిమా కి ముందు కూడా రవితేజ సక్సెస్ దక్కక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి.క్రాక్ సినిమా తో మళ్లీ గాడిన పడ్డట్లే అనుకుంటున్న సందర్భం గా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడడం తో ఆయన అభిమానులు తీవ్ర నిరాశ తో ఉన్నారు.
ఈ సమయం లో రవితేజ నుండి రాబోతున్న ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు ఇంకా రెండు మూడు సినిమా లు కూడా అభిమానుల్లో ఆశలు పెంచుతున్నాయి.ఇదే సమయం లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా యొక్క కథ లో అత్యంత కీలకమైన పాత్ర ను కూడా రవి తేజ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది.
రవి తేజ చేస్తున్న సినిమా లు వరుసగా సక్సెస్ అవ్వకుంటే చిరంజీవి సినిమా లో చేస్తున్నట్లుగా ముఖ్య పాత్ర లు.

వయసుకు తగ్గట్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రవితేజ కొనసాగాల్సి వస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రవి తేజ ఇక పై అయినా కథల ఎంపిక విషయం లో జాగ్రత్త తీసుకోవాలని.లేదంటే ఆయన కెరియర్ హీరో గా ఖతం అయ్యే సమయం వచ్చిందంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికి టాలీవుడ్ మాస్ మహారాజా అంటూ గుర్తింపు దక్కించుకున్న రవి తేజ వరుసగా చేస్తున్న సినిమా లు ఆయన సక్సెస్ క్రెడిట్ ని ఎంత వరకు కంటిన్యూ చేస్తారో చూడాలి.







