కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కారుపై దాడి జరిగింది.యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు.
గుండ్లపల్లి – గన్నేరువరం వరకు డబుల్ రోడ్ వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.ధర్నా సమయంలో వెళ్లిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కారుపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.దీంతో రాజీవ్ రహదారి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతరం నిరసన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.







