జబర్దస్త్ కామెడీ షోకి ఇటీవలే యాంకర్ అనసూయ స్థానంలో కొత్త యాంకర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అనసూయ వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు ఆ ప్లేస్ ని భర్తీ చేసిన రష్మి స్థానంలోకి మళ్ళీ కొత్త యాంకర్ ని తీసుకువచ్చారు.
ఇకపోతే తాజాగా గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో సౌమ్యరావు యాంకరింగ్ బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే కొత్త యాంకర్ రావడంతో అప్పుడే హైపర్ ఆది ఆమెతో పులిహోర కలిపి ప్రయత్నం చేశాడు.
ఇక ఆ విషయం పసిగట్టిన సౌమ్యరావు నువ్వు ఎంత పులిహోర కలిపినా ప్రయోజనం లేదు అని ముఖం మీద చెప్పేసింది.
ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
ఆ ప్రోమోలో సౌమ్య రావు షార్ట్ ఫ్రాక్ ధరించి సూపర్ గ్లామరస్ గా కనిపించింది.రెండవ ఎపిసోడ్ కే గ్లామర్ డోస్ ని పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.
అయితే గతంలో అనసూయ రష్మి ఇద్దరూ జబర్దస్త్ షోలో పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ స్కిన్ షో చేసిన విషయం తెలిసిందే.రష్మితో పోల్చుకుంటే అనసూయ గ్లామర్ ట్రీట్ విషయంలో ఒక రేంజ్ లో రచ్చ చేసింది.
అయితే ఆమె డ్రెస్సింగ్ బట్టల అనేక రకాల విమర్శలు వినిపించిన నెగటివ్ కామెంట్స్ వినిపించినా కూడా అదే రీతిలో తగ్గకుండా దూసుకుపోయింది యాంకర్ అనసూయ.

అనసూయ స్థానంలోకి ఎంట్రీ ఇచ్చిన సౌమ్య రావు కూడా అనసూయ దారిలోనే నడుస్తోంది.అంత కొత్త అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతోనే హైపర్ ఆది పక్కనే ఉండి ఆమెను గోకే కార్యక్రమం మొదలు పెట్టేసాడు.తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బుట్ట బొమ్మ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది సౌమ్య రావు.
అప్పుడు హైపర్ ఆది ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు ఒక్కదానివి చేస్తే ఒట్టి బొమ్మ అవుతుంది నాతో పాటు చేస్తే బుట్ట బొమ్మ అవుతుంది అని అంటాడు.వెంటనే సౌమ్యా రావు నువ్వు ఎంత పులిహోర కలుపుతున్నా నేను నీకు పడను అని అంటుంది.
వెంటనే హైపర్ ఆది నేను ఎవరో తెలుసా చిరంజీవి అభిమానిని అని డైలాగ్ కొట్టడంతో వెంటనే ఆమె రివర్స్ పంచ్ వేయడంతో హైపర్ ఆది మౌనంగా ఉండిపోయాడు.అయితే యాంకర్ రష్మీ వెంటపడి సుడిగాలి సుదీర్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నట్లు ఉన్నాడు మన హైపర్ ఆది.కానీ సుడిగాలి సుధీర్ లాంటి పాపులారిటీ మాత్రం హైపర్ ఆదికి లేదు అని చెప్పవచ్చు.సుధీర్ లాగే సౌమ్యరావుని కూడా లైన్ లో పెట్టి బాగా పాపులర్ అవ్వాలి అని చూస్తున్నాడు మన హైపర్ ఆది.







