Adithya menon: కష్టపడి చేసిన సీన్స్ అన్నీ కట్ చేసారు.. వీడికి ఇవన్నీ అవసరమా అన్నారు: నటుడు ఫైర్

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు ఆదిత్య మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలు లో విలన్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

 Adithya Menon My Face Got Paralyzed Details, Adithya Menon, Tollywood, Deleted S-TeluguStop.com

విలన్ గా సహాయ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించాడు.కాగా మొదట ప్రభాస్ నటించిన బిల్లా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆ తర్వాత బాలయ్య బాబు నటించిన సింహా సినిమాతో బ్రేక్ అందుకున్నాడు ఆదిత్య మీనన్.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదిత్య మీనన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆదిత్యా మీనన్ మాట్లాడుతూ.

2016లో తనకు బెల్స్ పాల్సి అటాక్ అయిందని, దాంతో ముఖం సగం భాగం పక్షవాతానికి గురైనట్లు తెలిపాడు.అయితే ఆ సమస్య తనకు ఒత్తిడి వల్ల వచ్చిందని తెలిపాడు.ఒక నటుడుగా చాలా భయం అయ్యింది.ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకున్నాను.అలా చికిత్స తీసుకున్న ఒక నెల రోజుల్లోనే తిరిగి మామూలు మనిషిని అయిపోయాను అని చెప్పుకొచ్చాడు ఆదిత్య మీనన్.

అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సంఘటన గురించి గుర్తు చేసుకున్నాడు.

ఒక మలయాళ సినిమా కోసం చాలా కష్టపడి ఎన్నో స్టంట్ సీన్స్ చేశాను.

Telugu Aditya Menon, Adithya Menon, Adityamenon, Billa, Scene, Malayala, Simha,

ఆ తర్వాత సినిమాకు సంబంధించిన పెద్ద నటుడు వచ్చి ఇతనికి ఇంత పెద్ద సీన్లు అవసరమా.కొన్ని సన్నివేశాలు కట్ చేయండి అని చెప్పాడట.అలా ఆదిత్య మీనన్ నటించిన కొన్ని సీన్లను తీసేశారట.ఆ సమయంలో తాను ఎంతో బాధపడినట్లు ఆదిత్య మీనన్ చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా ఆ సినిమా తర్వాత తనకు సినిమా అంటే ఒక గేమ్ అని, స్క్రీన్ పై వచ్చేదాకా మనం సినిమాలో ఎక్కడున్నావు అనేది ఎవరికీ తెలియదని, ప్రస్తుతం సర్వసాధారణంగా జరుగుతున్న విషయం ఇది.ఇదివరకు మాదిరి ఇప్పుడు సినిమాలో నా సన్నివేశాలు తగ్గించినా కూడా నేను అంతగా బాధపడను అని ఆదిత్యామీనన్ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube