తెలుగు తెరకు ఎవరు ఊహించని విధంగా సినిమాలు, అందులోని పాత్రలను పరిచయం చేసే దర్శకుడు రాజమౌళి.అలాంటి రాజమౌళి దర్శకత్వంలో వచ్చి తెలుగు ప్రేక్షకులకు మర్చిపోలేని వ్యక్తులను పరిచయం చేసిన సినిమా సై.
ఈ సినిమా 2004 లో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.నితిన్ మరియు జెనీలియా హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం లో వీరి పాత్రలను డామినేట్ చేస్తూ విలన్ పాత్రలో నటించిన భిక్షు యాదవ్ కనిపిస్తాడు.
హీరో ను మించి భిక్షు యాదవ్ ఈ సినిమాలో అభిమానులను ఆకట్టుకున్నాడు.భిక్షు యాదవ్ గా బరి లోకి దిగి ఆట ఆడుతుంటే చూసే ప్రతి ఒక్కరికి నిజంగానే భయంకరంగా కనిపిస్తాడు.
ఇక హీరో చెప్పిన డైలాగ్స్ కన్నా కూడా ఈ సినిమాలో విలన్ చెప్పిన కొన్ని డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి.భిక్షు యాదవ్ పాత్రలో నటించిన నటుడి పేరు ప్రదీప్ రావత్.
ఈ సినిమాలో అతడి నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు ప్రతినాయకుడు పురస్కారము లభించింది.తెలుగు లో నటించడానికి ముందే హిందీ టెలివిజన్ లో మహాభారత్ లో అశ్వథామ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇక తమిళ్ లో గజినీ సినిమాలోనూ సై సినిమాకు మించి మంచి వచ్చింది.మొదట్లో బాలీవుడ్ లో ఎవరు సపోర్ట్ చేయకపోయినా తన లుక్, ట్యాలెంట్ తోనే అవకాశాలు సంపాదించుకొని 1985 నుంచి ఇండస్ట్రీ లో కొనసాగుతన్నాడు.

ఒకానొక దశలో కెరీర్ ముగిసిపోతుంది అనుకున్నప్పుడు రాజమౌళి ఇచ్చిన సై సినిమా అతడికి సౌత్ ఇండస్ట్రీ కి తోవ చూపింది.ఈ సినిమా తర్వాత తెలుగు మరియు తమిళ్ లో చాల సినిమాల్లో నటించాడు.అయితే కొంత మేర బిజీ గా ఉంటూ ఎప్పుడు సినిమాలు చేస్తున్న సై సినిమా తరహాలో విలనిజం తో బయపెట్టించే పాత్రల్లో మాత్రం కనిపించడం లేదు.నిజం చెప్పాలంటే చాల కామెడీ విలన్ గా కూడా మారిపోయాడు.
అయినప్పటికీ సై సినిమా చూసినప్పుడల్లా భిక్షు యాదవ్ ని చూసి జనాలు భయపడుతూనే ఉంటారు.ఇక రానున్న రోజుల్లో అయినా మంచి విలనీ పాత్రల్లో ప్రదీప్ రావత్ కనిపించాలని కోరుకుందాం.







