ట్రాఫిక్ పోలీసులపై ప్రజల్లో కాస్త చెడు అభిప్రాయం ఉంటుంది.లంచాల కోసమే రోడ్లపై నిలబడి జనాలను దోచేస్తుంటారని జనాలు తప్పుగా అభిప్రాయపడుతుంటారు.
కానీ నిజానికి వీరు లేకపోతే యాక్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోతాయి.అంతేకాదు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్స్ అవుతాయి.
రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేయడంలో, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చేయడంలో ట్రాఫిక్ పోలీసులదే ప్రధాన పాత్ర.అయితే తాజాగా ఒక ట్రాఫిక్ పోలీస్ గొప్ప పని చేసి అందరి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.
డ్యూటీకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోవడానికి చూసి ఈ ఆఫీసర్ వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి రంగంలోకి దిగారు.ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారి తాను ప్రయాణిస్తున్న ఆటోరిక్షాలో నుంచి దిగి నిలిచిపోయిన వాహనాలకు చక్కగా డైరెక్షన్స్ ఇచ్చి అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.
తాపీగా ఆఫీస్‌కి వెళ్లి కాసేపు అక్కడ కాలక్షేపం చేసి డ్యూటీ ఎక్కే ఉద్యోగులు ఉంటారు.కానీ కొందరు మాత్రం అనునిత్యం డ్యూటీ చేస్తూనే ఉంటారు.ఈ పోలీస్ ఆఫీసర్ కూడా ఆకోవకి చెందిన వారే అంటూ చాలామంది అతన్ని పొగుడుతున్నారు.

అతని గొప్పతనాన్ని అభినందిస్తూ, పబ్లిక్ అండ్ గవర్నమెంట్ అఫైర్స్ డైరెక్టర్ ప్రభాత్ సిన్హా ఓ ఫొటోను పంచుకున్నారు.ఆ ఫొటో అధికారి పోలీసు యూనిఫాంలో తన భుజంపై బ్యాగ్‌తో కనిపించారు.అతను ట్రాఫిక్ స్టక్ అయిన వైపు వెళుతున్నట్లు ఫొటోలో కనిపించింది.‘ముంబై పోలీస్– ఈ బాధ్యతాయుతమైన పోలీసు తన పనికి వెళుతున్నప్పుడు ఆటోరిక్షా నుంచి దిగి, ట్రాఫిక్‌ను నియంత్రించి, ఆపై తన డ్యూటీకి బయలుదేరారు,’ అని సిన్హా శుక్రవారం ట్వీట్ చేశారు.ఈ పోస్ట్‌ను ముంబై పోలీసులు ట్విట్టర్‌లో రీట్వీట్ చేశారు.







