యాపిల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో చౌకైన మోడల్ ఐఫోన్ 13 మినీ అని చెప్పొచ్చు.దీనిని భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అమ్ముతోంది.అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో సహా మిగతా ఆఫర్స్ కింద యాపిల్ ఐఫోన్ 13 మినీ ఇప్పుడు రూ.34,490కే లభిస్తోంది. ఐఫోన్ 13 మినీ 128జీబీ మోడల్ అసలు ధర రూ.64,990గా ఉండగా ఫ్లిప్‌కార్ట్ రూ.9,910 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.దాంతో ఈ ప్రీమియం మొబైల్ ధర రూ.54,990కి తగ్గింది.ఎక్స్ఛేంజ్, బ్యాంక్ డిస్కౌంట్ డీల్‌లతో మొత్తం ధర రూ.34,490కి దిగివస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించమని కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ ఇన్‌స్టంట్ రూ.3,000 డిస్కౌంట్ పొందొచ్చు.యాపిల్ ఐఫోన్ 13 మినీ 5.4-అంగుళాల OLED స్క్రీన్, A15 బయోనిక్ ప్రాసెసర్, సిరామిక్ కవర్, ఐపీ68 ప్రొటెక్షన్ రేటింగ్ వంటి ఆకర్షణ ఏమైనా ఫీచర్లతో వస్తుంది.ఐఫోన్ 13 మినీ 128జీబీ , 256జీబీ లేదా 512జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
యాపిల్ ఐఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఐఫోన్ 13 మినీ ఒక డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్.దీనిలో 12ఎంపీ ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరా, వెనుకవైపు 12ఎంపీ అల్ట్రా-వైడ్ సెకండరీ సెన్సార్ ఉంది.
దీని ముందు భాగంలో 12 మెగాపిక్సెల్‌ల రిజల్యూషన్‌తో సెల్ఫీ కెమెరా ఉంది.

తక్కువ ధరకే ఐఫోన్స్ కొనాలనుకునే వారు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలలో డీల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.ఎందుకంటే ఏడాది పొడుగుత ఈ కంపెనీలు ఐఫోన్లపై ఆకర్షణ ఏమైనా తగ్గింపులను తీసుకొస్తూనే ఉంటాయి.







