UAE VIsa Grace Period : “యూఎఈ” లోని ప్రవాసులకు గుడ్ న్యూస్...వీసా గడువు ముగిసినా సరే...!!!

ఏ దేశానికైనా ఇతర దేశస్తులు అక్కడ పనిచేసేందుకు లేదా వ్యాపారం చేసేందుకు వలసలు వెళ్ళటం సహజమే.వివిధ రకాల వీసాల ద్వారా ఆయా దేశాలకు వలసలు వెళుతుంటారు వలసవాసులు.

 Uae Announces 6-month Grace Period After Expiry Or Cancellation Of Visa,uae Visa-TeluguStop.com

ఈ క్రమంలో ఒకవేళ వలసదారుడు తన వీసాను రద్దు చేసుకోవాలనుకున్నా లేదా కొత్త వీసాలను పొందాలన్నా లేదా దేశం నుంచి వెళ్లిపోవాలనుకున్నా వారికి కొన్ని రోజుల గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది .ఈ గ్రేస్ పీరియడ్ అయ్యేలోగా వలసవాసులు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఆ దేశ చట్టాలకు అనుగుణంగా శిక్షించబడతారు.ఈ క్రమంలో


యూఏఈ ప్రభుత్వం తమ దేశంలో ఉంటున్న ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పింది.రెసిడెన్సి వీసా రద్దు చేసుకోవాలనుకున్నా లేదా గడువు ముగిసిన తర్వాత దేశాన్ని విడిచి వెళ్లాలన్నా అందుకు గతంలో ఉన్న సమయం కంటే ఎక్కువ గ్రేస్ పిరియడ్ పెంచుతున్నట్లుగా ప్రకటించింది.

ఇప్పటివరకు కేవలం రెండు నెలల గ్రేస్ పీరియడ్ మాత్రమే ఉండేది, అయితే తాజాగా యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ వ్యవధిని ఆరు నెలలకు పెరిగింది.ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ సిటిజెన్షిప్ కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ ఈ ప్రకటనను చేసింది.అయితే

Telugu Grace Period, Federalidentity, Uae, Uae Visa, Visa Expiry-Telugu NRI

రెండు నెలల నుంచి మూడు నెలలు పెంచిన గ్రేస్ పీరియడ్ అనేది కేవలం గోల్డెన్ వీసా దారులకు వారితోపాటు వారి కుటుంబ సభ్యులకు, చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు, నైపుణ్యత కలిగిన నిపుణులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది అలాగే 90 రోజుల గ్రేస్ పీరియడ్ కేవలం ఆస్తులు కలిగి ఉన్న యజమానులకు వర్తిస్తుందని తెలిపింది 60 రోజుల గ్రేస్ పిరియడ్ సాధారణ నివాసితులకు వర్తిస్తుందని ఇక 30 రోజుల గ్రేస్ పీరియడ్ అనేది ఇతర కేటగిరి లకు చెందిన వారికి వర్తిస్తుందని ప్రకటించింది.అత్యవసర పరిస్థితుల్లో ఈ విధానం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube