అమరావతి భూ కుంభకోణంలో సిట్ ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది.
గత ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేసే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదన్న అంశాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది.ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం లోతుగా చర్చిస్తామని తెలిపింది.
అనంతరం తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.







