RRR సినిమాతో మరోసారి తెలుగు సినిమా సత్తా ను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమా చేయబోతున్నాడు.దీనికి సంబందించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నారు.అయితే రాజమౌళి ఈ సినిమాను రెండు పార్టుల్లో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రాజమౌళి బాహుబలి చిత్రాన్ని రెండు పార్టుల్లో తెరకెక్కించి అద్భుత విజయం సాధించారు.ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ను పాన్ ఇండియా గా తెరకెక్కించి మరో విజయం అందుకున్నారు.
ఇక ఇప్పుడు మహేష్ తో చేయబోయే చిత్రాన్ని రెండు పార్టుల్లో తెరకెక్కించాలని చూస్తున్నాడట.ఈ సినిమా గ్లోబ్ట్రోటింగ్ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు వినికిడి.ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌తో షూట్ చేయనున్నారట.దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.ఇక మహేష్ విషయానికి వస్తే.
ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా.
మూడో షెడ్యూల్ మొదలుపెట్టాల్సి ఉండగా.హీరోయిన్ పూజా హగ్దే కాలికి గాయం కావడం తో షెడ్యూల్ ఆలస్యం అవుతుంది.
ఈ తరుణంలో మహేష్ జిమ్ లో కసరత్తులు చేస్తూ మరింత స్లిమ్ అవుతున్నాడు.దీనికి సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.







