ఊర్వశీ రౌతేలా పరిచయం చేయాల్సిన అవసరం లేని భామ.హాట్ హాట్ అందాలతో యూత్ లో వేడి సెగలు పుట్టించే ఈ భామ.
ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి పక్కన చిందులేస్తుంది.గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.
ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో తన 154 వ చిత్రం వాల్తేరు వీరయ్య చేస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల దీపావళీ సందర్భంగా విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఐటెం సాంగ్ లో చిందులేస్తుంది.ఈ ఐటెం సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా , రాక్ స్టేర్ దేవి శ్రీ అదిరిపోయే బిట్ ఇచ్చాడట.
ఈ సాంగ్ లో చిరు, రవితేజ, ఊర్వశీ రౌతేలా ముగ్గురు కూడా అదిరిపోయే స్టెప్స్ తో అలరింపచేయనున్నారని సమాచారం.ఊర్వశీ రౌతేలా కేవలం ఐటెం సాంగ్ లో మాత్రమే కాదట.
కొన్ని సీన్లలో కూడా కనిపించబోతుందని అంటున్నారు.మరి ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయని అనేది చూడాలి.







