హైదరాబాద్ లోని బోడుప్పల్లో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు.ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
బిల్డర్లు ఇళ్లను నిర్మించినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని బాధితులు ప్రశ్నించారు.బిల్డర్లు ఇళ్లను విక్రయించాక కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.







