Pawan Kalyan Bhanu : పవన్ పాట పాడిన భాను.. బాగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

మామూలుగా కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు, ఆర్టిస్టులకు పాటలు పాడే సందర్భం, డాన్స్ చేసే సందర్భాలు వస్తుంటాయి.అయితే అందులో మంచి టాలెంట్ ఉన్నవాళ్లు చేస్తే బాగుంటుంది.

 Bhanu Who Sang Pawan S Song Are The Netizens Trolling , Bhanu , Sri Drama Compan-TeluguStop.com

కానీ ఏమీ రాకుండా డాన్స్ చేయటం, పాటలు పాడటం లాంటివి మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.కానీ కొన్ని కొన్ని సార్లు పాడాల్సి వస్తే మాత్రం పాడి మరి ట్రోల్స్ ఎదుర్కొంటారు కొందరు.

ఇప్పుడు అటువంటి ట్రోల్స్ నే ఎదుర్కొంటుంది బిగ్ బాస్ భానుశ్రీ.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి, బుల్లితెర ఆర్టిస్ట్ యాంకర్ భాను శ్రీ గురించి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

వెండితెరపై పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.ఇక బిగ్ బాస్ లో అడుగుపెట్టి ఎంత అలా రచ్చ చేసిందో చూసాం.ఆ షో లో ఉన్నంతకాలం తన మాటలతో బాగా గారడి చేసింది.

ఇక బయటికి వచ్చాక బాగా ట్రోల్స్ ఎదుర్కొంది.

ఆ తర్వాత వెండితెరపై పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.ఇక బుల్లితెరపై మాత్రం ఏదైనా ఈవెంట్లలో పాల్గొని బాగా సందడి చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

నిత్యం బాగా ఫోటోలు షూట్ చేయించుకుంటూ.వాటిని వెంటనే అభిమానులకు పంచుకుంటుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.ఇక మరిన్ని అవకాశాల కోసం మాత్రం ఈ అమ్మడు బాగా గ్లామర్ షో చేస్తుంది.కానీ ఈమెను పట్టించుకునే వాళ్లే లేరు.

అయితే అప్పుడప్పుడు ఈమె చేసే వీడియోల పట్ల, పంచుకునే ఫోటో పట్ల ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటుంది.అయిన.కూడా వాటిని అస్సలు పట్టించుకోదు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరోసారి ట్రోల్స్ ఎదుర్కొంది భాను.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రసారమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో సుధీర్ రీఎంట్రీ ఇవ్వటంతో షో మొత్తం సరదాగా సాగింది.మిగతా ఆర్టిస్టులంతా బాగా సందడి చేశారు.తమ డాన్స్ లతో బాగా అలరించారు.అయితే అందులో భాను కూడా పాల్గొంది.అయితే భాను పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలోని గెలుపు తలుపులే పాటను పాడింది.

ఇక ఆ పాట ఆమె పాడటంతో అక్కడున్న వాళ్లంతా బాగా ఫీల్ తో ఎంజాయ్ చేశారు.

కానీ ఈ ప్రోమో చూసిన నెటిజెన్స్ మాత్రం.వద్దు నువ్వు ఈ పాట అసలు పాడకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube