దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఐటీ, ఈడీ అధికారులు దూకుడు పెంచారు.దీనిలో భాగంగా తెలంగాణలో మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు ఐటీ, ఈడీ అధికారులు సంయుక్తంగా సోదాలు చేస్తున్నారు.ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు పలువురు నివాసాలతో పాటు పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
దేశంలోని 35 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది.ఈడీ అధికారులు హైద్రాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, పంజాబ్, ముంబై తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ కేసులో ఇప్పటికే సమీర్ మహేంద్రు, బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.







