ప్రతి రోజు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలను చాలామంది ప్రజలు షేర్ చేస్తూ ఉంటారు.ఇలా షేర్ చేసే వీడియోలలో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.
అందులో ఎక్కువగా ప్రముఖ వ్యాపారవేత హర్ష గోయెంకా షేర్ చేసిన వీడియోలు ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.హర్ష గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలు ఎక్కువగా స్ఫూర్తిని కలిగించేలా ఉంటాయి.
తాజాగా ఆయన షేర్ చేసిన ఒక వీడియో లీడర్ షిప్ అంటే ఏమిటో తెలియజెప్పేలా ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏముందంటే అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్‌లో గల రద్దీ రహదారిపై కొన్ని టర్కీ కోళ్లు రోడ్డు దాటుతూ కనిపించాయి.
అందులోని ఓ కోడి రోడ్డు మధ్యలో నిలబడి, మిగిలిని కోళ్లలను రోడ్డు దాటిస్తుంది.అవి అన్ని రోడ్డు దాటాకా చివరి కోడితోపాటు అది కూడా రోడ్డు దాటుతుంది.
కోళ్లు రోడ్డు దాటుతున్న సమయంలో రహదారికి ఇరువైపులా వాహనాలు అన్ని నిలబడి ఉండడం ఆ వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియో షేర్ చేసిన హర్ష గోయెంకా లీడర్ షిప్ కు ఇదో పాఠం అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.లీడర్ షిప్ అంటే అధికారం కాదు అది ఒక బాధ్యత అనేందుకు నిదర్శంగా ఆయన ఈ వీడియోను షేర్ చేసినట్టు వెల్లడించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
ఈ వైరల్ అవుతున్న వీడియోని చూసిన నేటిజెన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.మీరు చెప్పింది నిజమే సార్ లీడర్షిప్ అంటే ఇలాగే ఉండాలి అని కొంతమంది, పెద్దరికం అంటే అధికారం కాదు బాధ్యత అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







