కరోనా కారణంగా ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వల్ల ప్రజలు అప్పట్లో ఇళ్లకే పరిమితం కావడం తెలిసిందే.ఆ టైంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు ఉచిత రేషన్ కేంద్ర ప్రభుత్వం అందించింది.
ఇంకా ఇప్పటికీ ఈ పథకం చాలా రాష్ట్రాలలో అమలవుతోంది.ఈ క్రమంలో పలువురు అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు కేంద్రం గుర్తించింది.
దీంతో దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయడానికి రెడీ అయింది.పన్ను చెల్లించేవారు, పది ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వాళ్లు.
నాలుగు నెలలుగా రేషన్ తీసుకోని వారి కార్డులు కూడా రద్దు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.త్వరలోనే అనర్హుల పూర్తి జాబితా లిస్ట్ రేషన్ డీలర్లకు పంపించడానికి కేంద్రం రెడీ చేస్తూ ఉంది.
సో వీరికి ఉచితంగా అందించే కందిపప్పు, బియ్యం, గోధుమలు నిలిపేయనుంది.