News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20

1.గవర్నర్ పై కూనంనేని సంచలన వ్యాఖ్యలు

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ias Sri Lakshmi, Lunar Eclipse, Mlc Ka

గవర్నర్ వ్యవస్థ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.మంత్రులను తన ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నానని గవర్నర్ అన్నారని, మీరు గవర్నర్ నా లేక బిజెపి కార్యకర్త అంటూ తెలంగాణ గవర్నర్ తమిళ సైని ఉద్దేశించి కూనం నేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2.ప్రధాని తెలంగాణ పర్యటనను అడ్డుకోవాలని సిపిఐ పిలుపు

 భారత ప్రధాని నరేంద్ర మోది తెలంగాణ పర్యటనను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు సిపిఐ పిలుపునిచ్చింది. 

3.జ్ఞానవాసి మసీదు కేసులో తీర్పు వాయిదా

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ias Sri Lakshmi, Lunar Eclipse, Mlc Ka

జ్ఞానవాసి మసీదు ప్రాంగణంలోని శివ లింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలని హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్ పై వారణాసి లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును 14 వ తేదీకి వాయిదా వేసింది. 

4.ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊరట

  ఓబులాపురం మైనింగ్ కేసులు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట లభించింది.ఈ కేసులో శ్రీలక్ష్మి పై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టి వేసింది. 

5.కేసిఆర్ కు కురుమ సంఘం సన్మానం

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ias Sri Lakshmi, Lunar Eclipse, Mlc Ka

టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కురుమ సంఘం నేతలు సన్మానం చేశారు. 

6.కేసిఆర్ వెంటే ప్రజలు : కవిత

  టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారని విషయం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలతో వెళ్లడైందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 

7.పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ias Sri Lakshmi, Lunar Eclipse, Mlc Ka

ఐటీ, లైఫ్ సైన్స్, ఏరో స్పేస్ తదితర రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనుకూలమని తెలంగాణ ఐటి వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 

8.హెడ్ కానిస్టేబుళ్ళకు రెండు దశల్లో శిక్షణ

  కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన వారికి రెండు దశల్లో శిక్షణ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. 

9.పత్తి రైతులను ఆదుకోండి

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ias Sri Lakshmi, Lunar Eclipse, Mlc Ka

పత్తి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ ఏపీ శాఖ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. 

10.ఏపీ డీజీపీకి టిడిపి లేఖ

 ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టిడిపి నేత వర్ల రామయ్య లేఖ రాశారు.నందిగామ రోడ్డు షోలో చంద్రబాబుపై రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. 

11.ఇల్లు కోల్పోయిన వారికి పవన్ ఆర్థిక సాయం

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ias Sri Lakshmi, Lunar Eclipse, Mlc Ka

ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వ చర్యలు కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. 

12.విజయవాడ దుర్గమ్మ ఆలయం మూసివేత

 విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సూర్యగ్రహణం కారణంగా అధికారులు మూసివేశారు. 

13.బాధ్యతలు స్వీకరించిన ఆలీ

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ias Sri Lakshmi, Lunar Eclipse, Mlc Ka

 ఏపీ మీడియా సలహాదారుగా సినీ నటుడు వైసిపి నేత ఆలీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 

14.వైఎస్సార్ షాదీ తోఫా ఇబ్బందులపై సమీక్ష

 వైయస్సార్ షాదీ తోప పథకం అమలు చోటు చేసుకుంటున్న ఇబ్బందులపై ఏపీ మైనారిటీ శాఖ కార్యదర్శి ఇంతియాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.దీనిలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. 

15.ముఖ హజరులో లొకేషన్ అప్ డేట్ కు అవకాశం

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ias Sri Lakshmi, Lunar Eclipse, Mlc Ka

ముఖ హాజరులు లోకేషన్ తప్పుగా నమోదు చేసుకున్న వారికి సరైన లొకేషన్ అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 

16.నీట్, జే ఈ ఈ కి డిజిటల్ మెటీరియల్

 నీట్, జే ఈ ఈ 2023 ప్రవేశ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం డిజిటల్ మెటీరియల్ ను రూపొందించినట్లు ఐఐటి ,జేఈఈ ఫోరం  తెలిపింది. 

17.ఎయిమ్స్ లో ఆరోగ్య శ్రీ సేవలు

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ias Sri Lakshmi, Lunar Eclipse, Mlc Ka

మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలోనే ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 

18.మరో వివాదంలో గోరంట్ల మాధవ్

  వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు.ఇంటి అద్దె ,విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంపై ప్రశ్నించిన ఇంటి యజమాని మాధవ్ అనుచరులు బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. 

19.ఏపీలో ధాన్యం కొనుగోళ్లపై జగన్ సూచన

 

Telugu Apcm, Chandrababu, Cm Kcr, Corona, Ias Sri Lakshmi, Lunar Eclipse, Mlc Ka

ఏపీలో దాన్ని కొనుగోలు వ్యవహారం ను సీరియస్ గా తీసుకోవాలని , కనీసం మద్దతు ధర కంటే తక్కువకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాటలు రాకుండా చూడాలని అధికారులను జగన్ ఆదేశించారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,800
  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,050

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube