మలబద్ధకం.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మందిని సర్వసాధారణంగా వేధించే జీర్ణ సంబంధిత సమస్య ఇది.అయితే మలబద్ధకాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు.పొరపాటున చేశారా.
ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.ఈ నేపథ్యంలోనే మలబద్ధకాన్ని నివారించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
కొందరైతే మందులు కూడా వాడతారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే స్మూతీని డైట్ లో చేర్చుకుంటే.
సహజంగానే మలబద్ధకం పరార్ అవుతుంది.మరి ఇంతకీ ఆ స్మూతీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక మీడియం సైజు గుమ్మడి కాయను తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన గుమ్మడి కాయ తొక్క చెక్కేసి, లోపల ఉండే గింజలను తొలగించాలి.
ఆపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ ను పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలు వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత బ్లండర్ తీసుకుని అందులో ఉడికించి చల్లారపెట్టుకున్న గుమ్మడి ముక్కలు, ఐదు నుంచి ఆరు గింజ తొలగించిన ఖర్జూరాలు, అర కప్పు ఆరెంజ్ పండు ముక్కలు వేసుకోవాలి.
చివరిగా ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలు ఉడికించిన నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజలు, వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసుకుంటే మన స్మూతీ సిద్ధం అవుతుంది.
ఈ స్మూతీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.ఈ స్మూతీని డైట్ లో కనుక చేర్చుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది.
దాంతో మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.అదే సమయంలో గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ తదితర జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా కూడా ఉంటాయి.