పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
మరి ఈ సినిమా కోసం చూసే డార్లింగ్ ఫ్యాన్స్ కు నిన్న ఓం రౌత్ బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తుంది.
ఆదిపురుష్ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించారు.లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.
లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.
ప్రేక్షకులకు పూర్తిగా అద్భుతమైన విజువల్ అనుభూతి ఇవ్వడం కోసం మాకు మరింత సమయం కావాలి అంటూ ఈ సినిమాను జూన్ 16, 2023 కి వాయిదా వేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిరాశ చెందుతున్నారు.
అయితే కొత్త రిలీజ్ డేట్ పై అప్పుడే ప్రేక్షకుల్లో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి.

జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి ఓం రౌత్ తప్పు చేసాడు అని అంటున్నారు.ఎందుకంటే అదే సమయంలో జూన్ 2న షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ తర్వాత కూడా హాలీవుడ్ మూవీస్ వరుసగా రిలీజ్ కాబోతున్నాయి.
ఇలాంటి డేట్స్ మధ్య ఆదిపురుష్ సినిమాను ఎలా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు.ఈ సినిమాల వల్ల థియేటర్స్ సమస్య తప్పకుండ వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా ఇదే జరుగనుంది.అలాగే జూన్ లో పాఠశాలలు కూడా ఓపెన్ అవుతాయి.
దీంతో ఫ్యామిలీస్ థియేటర్స్ కు రావడం కష్టమే.మరి ఈ లాజిక్స్ అన్ని మేకర్స్ ఎలా మిస్ అయ్యారు అంటున్నారు.
చూడాలి అప్పుడైనా రిలీజ్ అవుతుందో లేదో.







