Janhvi Kapoor : సోషల్ మీడియాను సీరియస్ గా అస్సలు తీసుకోను.. నటి కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ధడక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు నటి జాన్వీ కపూర్.అయితే ఈమెకు సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీ కన్నా సోషల్ మీడియా ద్వారా చేసే పోస్టుల వల్ల ఎంతో పాపులారిటీ వచ్చిందని చెప్పాలి.

 I Don't Take Social Media Seriously At All Actress Comments Viral , Janhvi Kapoo-TeluguStop.com

నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో గ్లామర్ బ్యూటీగా పేరుపొందిన ఈమె వెండితెరపై మాత్రం ఎంతో డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు తన పాత్రలను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఇదే ప్రశ్న ఎదురైంది.సోషల్ మీడియాలో ట్రెండీ వేర్ లో కిల్లింగ్ లుక్ లో కనిపించే ఈమె వెండితెరపై మాత్రం మిడిల్ క్లాస్ అమ్మాయిల కనిపించడం ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.

నన్ను శారీలో చూసిన అభిమానులు చుడిదార్ లో చూసి ఇబ్బందిగా ఫీల్ కావచ్చు అయితే ఇది నా వృత్తి.నేను వాస్తవానికి దగ్గరగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాను అయితే సినిమాలలో నా పాత్రలకు వ్యక్తిగత జీవితానికి చాలా తేడా ఉంటుందని ఈమె తెలిపారు.

Telugu Glamorjanhvi, Janhvi Kapoor-Movie

ఇక సోషల్ మీడియాలో తన పోస్టులు చేస్తూ సోషల్ మీడియా గురించి ఈమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాను తాను సీరియస్ గా తీసుకోనని అది కేవలం ఫన్ కోసం మాత్రమే అంటూ ఈమె కామెంట్ చేశారు.సోషల్ మీడియాలో ఇలా గ్లామర్ క్యూట్ ఫోటో షూట్ చేయడం వల్ల మరింత మంది అభిమానులు పెరుగుతారు తద్వారా బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది.తద్వారా ఆదాయం కూడా పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.ఇలా సోషల్ మీడియా గురించి జాన్వీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube