మాజీమంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

మాజీమంత్రి నారాయణ ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.బెయిల్ రద్దు చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది.

 Ex-minister Narayana's Anticipatory Bail Cancellation Petition Dismissed-TeluguStop.com

ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులను నారాయణ ఉద్దేశ పూర్వకంగా చేశారంటూ సీఐడీ కేసు నమోదు చేసింది.ఈ కేసులో సీఐడీ చర్యలు తీసుకోకముందే నారాయణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

వైద్య చికిత్సల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి ఉందని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరగా.హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అయితే ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది.ఈ క్రమంలో కేసు దర్యాప్తుకు నారాయణ సహకరించకపోతే బెయిల్ రద్దును కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది.

హైకోర్టు తీర్పుతో దర్యాప్తుపై ప్రభావం పడకూడదని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube