Sitaram Television Premiere: టెలివిజన్ ప్రీమియర్ గా సీతారామం... టెలికాస్ట్ ఎప్పుడంటే?

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ పూర్తిస్థాయి తెలుగు చిత్రం సీతారామం సినిమాలో నటించిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల అయ్యి థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

 Dulquer Salman Sitaram Television Premiere Details, Sitaramam, Dulquer Salman, S-TeluguStop.com

దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఒక అద్భుతమైన ప్రేమ కథ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటి మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు.

ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో నటుడు దుల్కర్ సల్మాన్ కు తెలుగులో ఎన్నో అవకాశాలు వస్తున్నాయి.

ఇక ఇందులోని పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని చెప్పాలి.

ఇలా థియేటర్లో సుమారు 80 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

Telugu Dulquer Salman, Dulquersalman, Mrunal Thakur, Sitaram, Sitaramam, Sitaram

థియేటర్ రన్ పూర్తి అయిన అనంతరం ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఓటీటీలో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి.ఈ విధంగా థియేటర్లోనూ డిజిటల్ మీడియాలోనూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న సీతారామం సినిమా త్వరలోనే టెలివిజన్ ప్రీమియర్ కానుందని తెలుస్తుంది.

ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా కైవసం చేసుకున్నారు త్వరలోనే ఈ సినిమాని స్టార్ మా లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.త్వరలోనే టెలికాస్ట్ తేదీ కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube