దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ తాజాగా ఓ అరుదైన ఫీట్ సాధించింది.అవును, దేశంలోనే మార్కెట్ విలువలో అగ్రగామిగా ఉన్న ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ర్టీస్.
ఉద్యోగస్తులు పని చేయడానికి అనుకూలమైన కంపెనీగా ప్రపంచంలోని 20 అత్యుత్తమ యాజమాన్య సంస్థల్లో ఒకటిగా నిలబడి రికార్డులకెక్కింది.ఫోర్బ్స్ మేగజైన్ 2022 సంవత్సరానికి గాను తాజాగా అత్యుత్తమ ఎంప్లాయర్ సంస్థల జాబితా విడుదల చేసింది.
ఈ లిస్టులో జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్, అమెరికాకు చెందిన కోకాకోలా, జపాన్ ఆటో దిగ్గజాలు హోండా, యమహా, సౌదీ ఆరామ్కోల కన్నా రిలయన్స్ హెచ్చుస్థాయి ర్యాంకులో నిలవడం గమనార్హం.
ఇక్కడ ఇంకో విషయం గురించి ఖచ్చితంగా చెప్పి తీరాలి.
టాప్ 100 కంపెనీల్లో భారత్ నుంచి రిలయన్స్ తప్ప మరే సంస్థ లేకపోవడం విచారకరం.ఇకపోతే ప్రపంచ అత్యుత్తమ ఎంప్లాయర్ల జాబితాలో దక్షిణ కొరియా ఎలక్ర్టానిక్స్ దిగ్గజం ‘సామ్‌సంగ్’ అగ్రస్థానంలో నిలవడం విశేషం.ఇక అమెరికన్ దిగ్గజాలు అయినటువంటి మైక్రోసాఫ్ట్, IBM, అల్ఫాబెట్, యాపిల్ తర్వాతి స్థానాల్లో వున్నాయి.2 నుంచి 12 ర్యాంకులు అమెరికన్ కంపెనీలకే దక్కడం గమనార్హం.
అలాగే జర్మనీకి చెందిన BMW 13వ స్థానంలో ఉంటే, ప్రపంచంలో అతి పెద్ద రిటైలర్ అమెజాన్ 14వ స్థానంలో ఉండడం గమనార్హం.ఆ తరువాత ఫ్రెంచి కంపెనీ డెకథ్లాన్ 15వ స్థానంలో ఉండి.ఈ జాబితాలోని ఇతర భారత కంపెనీల సంగతి చూస్తే బిత్తరబోవాల్సిందే.హెచ్‌డీఎఫ్‌సీ 137, బజాజ్ 173, ఆదిత్య బిర్లా 240, హీరోమోటోకార్ప్ 333, L&T 354, ICICI బ్యాంక్ 365, HCL టెక్ 455, SBI 499, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 547, ఇన్ఫోసిస్ 668 ర్యాంక్ కలిగి వున్నాయి.కాగా 2.3 లక్షల మంది ఉద్యోగులతో రిలయన్స్ అత్యున్నత ర్యాంకింగ్‌లో నిలిచి రికార్డులు సృష్టించింది.