సాధారణంగా ఒక హీరో సినిమా విడుదల అవుతుంది అంటే థియేటర్ల ముందు అభిమానులు ఒక పది రోజుల ముందు నుంచి పెద్ద ఎత్తున హడావుడి చేస్తుంటారు.భారీ కటౌట్ లో కట్టడం గజమాలతో సత్కరించి పాలాభిషేకాలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు.
ఇలా స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సమయంలో కేవలం హీరోల కటౌట్లు మాత్రమే థియేటర్ల ముందు దర్శనం ఇస్తాయి.అయితే థియేటర్లకు ఏమాత్రం తీసుపోని క్రేజ్ సమంతకు ఉందని చెప్పాలి.
సమంత విడాకుల తర్వాత నటించినటువంటి సినిమా యశోద నవంబర్ 11వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.
అయితే సమంతకు అనారోగ్యం చేయటం వల్ల ఈమె ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇతర చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే సమంత మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో నటించడంతో ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో థియేటర్ల ముందు యశోద సినిమా హడావిడి కనపడుతుంది.
ఈ క్రమంలోనే హైదరాబాదులో సుదర్శన్ థియేటర్లో హీరోలతో పాటు సమానంగా సమంత భారీ కట్ అవుట్ ను ఏర్పాటు చేయడం విశేషం.అయితే ఇదివరకే సమంత నటించిన ఓ బేబీ సినిమా సమయంలో కూడా ఇలా భారీ కటౌట్ ఏర్పాటు చేశారు తిరిగి ప్రస్తుతం యశోద సినిమా కోసం సమంత కటౌట్ థియేటర్ల ముందు ప్రదర్శితం అవడంతో ఎంతోమంది నెటిజన్ లు ఆశ్చర్యపోతున్నారు.ఇలా భారీ కటౌట్లు చూసినటువంటి నెటిజెన్స్ సమంత క్రేజ్ మామూలుగా లేదు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
మరి యశోద సినిమా ద్వారా సమంత ప్రేక్షకులను ఎలా సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.