ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చావ్లా రేప్ కేసులో ముగ్గురు నిందితులకు ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేసింది సుప్రీం ధర్మాసనం.
అంతేకాకుండా ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.పదేళ్ల కిందట ఈ దారుణ ఘటన జరిగింది.తీర్పు సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి ధర్మాసనం ముందు నిల్చున్న సెంటిమెంట్లకు ఇక్కడ తావు ఉండందంటూ తీర్పు వెల్లడించింది.
2012 ఫిబ్రవరి 9వ తేదీన ఢిల్లీ కుతుబ్ విహార్ వద్ద గురుగావ్ ఆఫీస్ నుంచి వస్తున్న సమయంలో కారులో వచ్చిన కొందరు దుండగులు చావ్లాను ఎత్తుకెళ్లారు.మూడు రోజుల తర్వాత హర్యానా రేవారి జిల్లా రోధాయి గ్రామ శివారులో యువతి మృతదేహాం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది.బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే ఢీల్లీ హైకోర్టు నిందితులకు 2014 ఫిబ్రవరిలో మరణ శిక్షను ఖరారు చేసింది.మానవ మృగాలుగా దోషులను పేర్కొన్న న్యాయస్థానం సమాజంలో తిరిగే హక్కును కోల్పోయారని వ్యాఖ్యనించారు.
ఈ కేసులో ఇరు వైపు వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.వాస్తవాలు, సాక్ష్యాలు ఆధారంగా తీర్పు ఉంటుందని సీజేఐ లలిత్ తెలిపారు.
సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటే కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు.