రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అంటే చాలా పాపులర్.ఈయన సంగీతం అందిస్తే ఆ సినిమాలు సూపర్ హిట్ అవ్వాల్సిందే.
మ్యూజికల్ గా మ్యాజిక్ చేసి సినిమాలను హిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ఈయన ఇది వరకులా సినిమాలకు సంగీతం అందించడం లేదని ఫ్యాన్స్ వాదన.
దీంతో ఈయన క్రేజ్ తగ్గిపోయింది.
మరి ఈయన కెరీర్ గ్రాఫ్ పడిపోతుంది అని అనుకునే సమయంలో పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమా మ్యూజికల్ గా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.పుష్ప తర్వాత ఈయన దాదాపు అరడజనకు పైగానే సినిమాలు చేసిన దేవి శ్రీ మార్క్ ఎక్కడ కనిపించలేదు.
ఇక ఒకటి రెండు పర్వాలేదు అనిపించుకున్న ఆ సినిమాలు హిట్ అవ్వకపోవడంతో దేవి శ్రీ పేరు వినిపించలేదు.

అయితే తాజాగా దేవి శ్రీ ప్రసాద్ చిరు వాల్తేరు వీరయ్య సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.పుష్ప తర్వాత మెగాస్టార్ సినిమాకు స్పెషల్ కేర్ తీసుకుని మరీ మ్యూజిక్ రెడీ చేసాడట.ఇప్పటికే ట్యూన్స్ అన్ని చేసి మెగాస్టార్ కు వినిపించినట్టు తెలుస్తుంది.
ఇక ఈ మ్యూజిక్ కూడా మెగాస్టార్ కు బాగా నచ్చడంతో మెగా మెప్పు పొందాడు అంటున్నారు.దీంతో మెగా ఫ్యాన్స్ కు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిరు దేవి శ్రీ కాంబోలో చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా మ్యూజికల్ గా మోతమోగించడం ఖాయం అంటున్నారు.ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ప్రెజెంట్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను రాజమండ్రిలో స్టార్ట్ చేసి మెగాస్టార్, రవితేజ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఉండేలా ప్లాన్ చేసాడట.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.








