మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై బీజేపీ పోస్ట్ మార్టం నిర్వహించనుంది.ఈ మేరకు సాయంత్రం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు.
మునుగోడులో ఓటమికి కారణాలను విశ్లేషించనున్నారు.అదేవిధంగా వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై కూడా చర్చించే అవకాశం ఉంది.
అనంతరం పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణను ప్రకటించనున్నారు.







