ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను టీడీపీ నేతలు కలిశారు.ఇటీవల నందిగామలో నిర్వహించిన రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు రాళ్ల దాడిపై టీడీపీ నేతలు ఆధారాలు సమర్పించారు.దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
అయితే ఈ ఘటనపై ఇప్పటికే నందిగామ పోలీస్ స్టేషన్ లో పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.కొందరు అనుమానితుల ఫొటోలను సైతం టీడీపీ విడుదల చేసింది.