Kota srinivasa rao టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా ఉన్న దర్శకులు వీళ్లే.. కోట కామెంట్స్ వైరల్!

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరైన కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ డైరెక్టర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.నటుడిగా నా సత్తా తెలిపిన సినిమాలు ఆమె, మా నాన్నకు పెళ్లి అని కోట శ్రీనివాసరావు అన్నారు.

 Kota Srinivasa Rao Comments Viral About Tollywood Directors Details Here Goes V-TeluguStop.com

నేను పని చేసిన దర్శకులలో టి.కృష్ణ అంటే చాలా ఇష్టమని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.ఇ.వి.వి.సత్యనారాయణ, ఆర్జీవీ అంటే కూడా ఇష్టమని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

రాజమౌళి, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్, వినాయక్ సత్తా ఉన్న డైరెక్టర్లు అని ఆయన పేర్కొన్నారు.సహ నటులలో బ్రహ్మనందం, బాబు మోహన్ అంటే నాకు చాలా ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సినిమాలలో నేటివిటీ మిస్ అవుతోందని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.ఇతర భాషల్లో ప్రాధాన్యత లేని నటులకు ఇక్కడ అవకాశాలు ఇవ్వడం కరెక్ట్ కాదని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

Telugu Puri Jaganadh, Ram Gopal Varma, Krishna, Tollywood-Movie

అన్ని పాత్రలకు ఇతర భాషల నటులను ఎంపిక చేయడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం సినిమా ఏం తీస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన కామెంట్లు చేశారు.నిర్మాతను సెట్ లోకి కూడా రానివ్వడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.చిన్న హీరోల సినిమాలపై ఆధారపడి ఇండస్ట్రీ కొనసాగుతోందని కోట శ్రీనివాసరావు అన్నారు.సినిమాల్లో తెలుగు నటులకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని ఆయన కామెంట్లు చేశారు.తెలుగులో నంబర్1 డైరెక్టర్ రాజమౌళి అని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

దర్శకుడిగా త్రివిక్రమ్ గొప్పవాడని నేను ఒప్పుకోను కానీ రైటర్ గా మాత్రం త్రివిక్రమ్ గొప్పవాడు అని కోట శ్రీనివాసరావు తెలిపారు.సినిమా రంగంలో సక్సెస్ కావాలంటే టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలన్జి ఆయన కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube