Bhola Shankar Chiranjeevi : వాల్తేరు వీరయ్య సెట్స్ లో సందడి చేసిన భోళా శంకర్ టీమ్.. పిక్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మరింత జోష్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ వాటిని అంతే వేగంగా పూర్తి చేస్తూ వస్తున్నాడు.ఇటీవలే మోహన్ రాజా దర్శకత్వంలో చిరు గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించాడు.

 Bhola Shankar Director In Waltair Veerayya Movie Sets, Waltair Veerayya, Megasta-TeluguStop.com

ఇక ఈ విజయం అందుకున్న ఆనందంలో నెక్స్ట్ సినిమాలపై ద్రుష్టి పెట్టాడు.ప్రెజెంట్ చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్‘ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

రెండు ఒకే సమయంలో షూటింగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపు తున్నాడు.అయితే తాజాగా ఈ రెండు సినిమాల మేకర్స్ ఒకే చోట చేరి సందడి చేసారు.

వాల్తేరు వీరయ్య సెట్స్ లో భోళా శంకర్ డైరెక్టర్ అడుగు పెట్టి పుట్టిన రోజు వేడుకలను జరుపు కున్నారు.

తాజాగా ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ కు సంబంధించి ఫోటోలు షేర్ చేస్తూ వాల్తేరు వీరయ్య సెట్స్ లో సందడి చేయడం గురించి చెప్పడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇక శేఖర్ మాస్టర్ తో కలిసి మెగాస్టార్, డైరెక్టర్ బాబీ సహా నటీనటుల సమక్షంలో బర్త్ డే జరుపు కోవడం చాలా ఆనందంగా ఉంది అని మెహర్ రమేష్ తెలిపాడు.దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఇక ప్రెసెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న భోళా శంకర్ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

Telugu Bhola Shankar, Bholashankar, Bobby, Chiranjeevi, Meher Ramesh, Ravi Teja-

అలాగే వాల్తేరు వీరయ్య సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది.ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలక రోల్ పోషిస్తున్నారు.2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube