Canada Sudhir Suri : శివసేన నేత హత్య మా పనే .. కెనడా గ్యాంగ్‌స్టర్ ప్రకటన, ఉలిక్కిపడ్డ పంజాబ్ పోలీసులు

పంజాబ్‌లో శివసేన నేత సుధీర్ సూరి దారుణహత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది.అమృత్‌సర్‌లో విరిగిన దేవుడి విగ్రహాలను ఆలయం ప్రాంగణం బయట చెత్తలో పడేయటాన్ని నిరసిస్తూ శివసేన నేతలు ఆందోళనకు దిగారు.

 Canada-based Gangster Lakhbir Singh Landa Takes Responsibility For Shiv Sena Lea-TeluguStop.com

ఈ సమయంలో సుధీర్‌తో పోలీసులు మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆయనపై అతి సమీపం నుంచి కాల్పులకు పాల్పడ్డాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సూరిని ఆసుపత్రికి తరలించగా.

అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.స్థానికులు కాల్పులు జరిపిన సందీప్ సింగ్ అనే వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

హత్య జరిగిన విధానాన్ని బట్టి ఆయన హత్యకు ముందే కుట్ర జరిగినట్లుగా తెలుస్తోంది.అయితే ఈ హత్యకు కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండా బాధ్యత వహించాడు.

ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.దీంతో పంజాబ్ పోలీసులు ఉలిక్కిపడ్డారు.

ఇప్పటికే సిద్ధూ మూసేవాలా హత్యకు కెనడా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ బాధ్యత వహించడం.మరికొందరు అక్కడి నుంచే రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతుండటంతో పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సూరిని లఖ్‌బీర్ గ్యాంగ్ హత్య చేయడం వెనుక కారణం ఏంటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Telugu Amritsar, Canada, Canadagangster, Gangsterlakhbir, Njan Singh, Parminder

ఎవరీ లఖ్‌బీర్ సింగ్ లాండా :

గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండా పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా హరికేకు చెందినవాడు.అతని తండ్రి నరంజన్ సింగ్ (75) మాజీ సైనికుడు .తల్లి పర్మీందర్ కౌర్ (65) వీరి కుటుంబానికి సొంత ఇల్లు, ట్రాక్టర్, విలాసవంతమైన కారు, 20 ఎకరాల భూమి వుంది.లాండాపై హత్య, హత్యాయత్నం, కాల్పులు వంటి దాదాపు 20 క్రిమినల్ కేసులు వున్నాయి.ఈ స్థాయిలో కేసులు వున్నా.అతను రెండేళ్ల క్రితం విదేశాలకు పారిపోయాడు.ఈ నేపథ్యంలో అతని అప్పగింత సహా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు.

అతనిపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ తరన్ తారన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయడం గమనార్హం.వ్యాపారులు, కాలనీవాసులు, డాక్టర్లను బెదిరించి ఇతను వసూళ్లకు పాల్పడేవాడని పోలీసులు చెబుతున్నారు.

గతేడాది మే 27న పట్టి వద్ద ఇద్దరు అకాలీదళ్ కార్యకర్తలను కాల్చిచంపిన కేసులోనూ అతను ప్రధాన సూత్రధారి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube