బుల్లితెరపై ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈ షో తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా మంచి ఆదరణతో దూసుకెళ్తుంది.
గతంలో తెలుగులో కూడా ఈ షో సక్సెస్ అవుతుందా కాదా అన్నట్లుగా నిర్వహించగా మొదటీ సీజన్ తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.అలా ఇప్పుడు సీజన్ 6 కూడా ప్రారంభం కాగా చాలావరకు కొన్ని వారలు కూడా ముగిసింది.
అన్ని సీజన్స్ లాగే ఈ సీజన్ లో కూడా సోషల్ మీడియా సెలెబ్రెటీలు, వెండితెర నటులు, సీరియల్ నటుడలు, యాంకర్లు కూడా అడుగు పెట్టారు.ఇక ఈ సీజన్ మొదట్లో కొన్ని వారాల వరకు బాగా స్పైసీగా సాగింది.
కానీ ఇప్పుడిప్పుడు చాలా చక్కగా కొనసాగుతుంది.మొదటి ఐదు సీజన్లు మాత్రం చాలా పోటాపోటీగా సాగేవి.కానీ ఈ సీజన్ అలా లేదు.ప్రారంభమైన మొదటివారం నుండే గొడవలకి దిగారు కంటెస్టెంట్లు.
అంతేకాకుండా ప్రతి సీజన్లో సాగినట్లే గ్రూప్ డిస్కషన్లు కూడా బాగా సాగాయి.ఈ సీజన్లో ట్విస్టులు కూడా అంతగా కనిపించడం లేదు.
ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య అంత స్ట్రాంగ్ వేరియంట్ కూడా కనిపించడం లేదు.ఇక ఇదంతా పక్కన పెడితే.
ఇప్పటివరకు ఈ సీజన్లో చాలామంది కంటెస్టెంట్లు హౌస్ నుండి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.ఇక గత వారం ఆర్ జె సూర్య కూడా ఎలిమినేట్ అయ్యాడు.
నిజానికి సూర్య ఇంత త్వరగా వెళ్తాడని ఎవరు ఊహించలేదు.చాలావరకు అతడు టాప్ ఫైవ్ లో ఉంటారని అనుకున్నారు.

అయితే తాజాగా ఇప్పుడు మరో టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది.ఇంతకు ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు గలాట గీతూ.మామూలుగా గలాట గీతూ టాప్ ఫైవ్ లో ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు.ఎందుకంటే ఆమె ఏంటో అందరికీ తెలిసిందే.
సీజన్ మొదలైనప్పటి నుంచి ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.ఈమెకు పోటీగా రేవంత్ కూడా ఉన్నాడు.
కానీ ఇప్పుడు వీళ్ళ మధ్య అంతా పోటీ కనిపించట్లేదు.దీంతో ఈ షో చూడటానికి ప్రేక్షకులు కూడా అంతగా ఇష్టపడటం లేదు.
అలా ఏడువారాలపాటు గీతూ బాగా స్పైసీగా ఆడింది.ఎవరైతే నాకేంటి అన్నట్లుగా ఆడింది.
ఎన్ని విమర్శలు ఎదుర్కున్నా కూడా బిగ్ బాస్ సపోర్ట్ బాగానే ఉంది.

కానీ గత వారం మాత్రం గీతూ ప్రవర్తనపై నాగార్జున కూడా ఫైర్ అయ్యాడు.అయితే ఈ వారం గీతూ కి మూడినట్లు తెలుస్తుంది.ఈసారి నామినేషన్ లో పదిమంది ఉండగా అందులో ఫైమా, మెరీనా, గీతూ తక్కువ ఓటింగ్ లో ఉన్నారు.
ఇక ఈసారి గీతూ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.ఆమె ఈసారి హౌస్ నుండి అవుట్ అని వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు ఆమెను ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపిస్తారని టాక్ వినిపిస్తుంది.ఇక ఇందులో ఎంత నిజముందో ఇప్పటివరకు తెలియలేదు.







