భోగాపురం ఎయిర్ పోర్టు కేసులన్నీ క్లియర్ అయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న భూ సంబంధిత కేసులు వెకేట్ అయ్యాయని తెలిపారు.
ఇక్కడి నిర్వాసితులను ఒప్పించి పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.త్వరలోనే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఈనెల 11న విశాఖకు ప్రధాని వస్తున్నారు కానీ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.







