Winter Weight Loss Juice: వింట‌ర్ లో వెయిట్ లాస్‌కి ఉప‌యోగ‌ప‌డే బెస్ట్‌ జ్యూస్ ఇది!

వింటర్ సీజన్ ప్రారంభం అయ్యింది.ఈ సీజన్ లో చాలా మంది చలి పులి కారణంగా ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేసేందుకు బద్దకిస్తుంటారు.

 This Is The Best Juice For Weight Loss In Winter Details! Weight Loss, Winter, B-TeluguStop.com

ఈ క్రమంలోనే బరువు పెరిగి పోతుంటారు.మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారా.? అయితే అస్స‌లు చింతించ‌కుండా ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించండి.ఈ జ్యూస్ వింటర్ లో వెయిట్ లాస్ అవ్వ‌డానికి ఎంతగానో సహాయపడుతుంది.

అలాగే ఎన్నో ఆరోగ్య లాభాలను సైతం అందిస్తుంది.

మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక యాపిల్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక కప్పు పైనాపిల్ ముక్క‌లు కట్ చేసి పెట్టుకోవాలి.

ఇక చివరిగా రెండు ఆరెంజ్ పండ్లు తీసుకుని సగానికి కట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ఆరెంజ్ జ్యూస్, అర అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన జ్యూస్ సిద్ధమవుతుంది.

Telugu Apple, Applepineapple, Tips, Latest, Orange, Pineapple-Telugu Health

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి డైరెక్ట్ గా తీసుకోవడమే.

ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది.దాంతో వేగంగా బరువు తగ్గుతారు.అలాగే ఈ వింట‌ర్ సీజ‌న్ లో తీసుకోవడం వల్ల చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా మారుతుంది.

కంటి చూపు మెరుగుపడుతుంది.సీజనల్ వ్యాధులను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.

ఇక ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల చలికాలంలో చర్మం నిగారింపుగా మ‌రియు కాంతివంతంగా కూడా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube