ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి వద్ద రూ.270 కోట్లతో నిర్మిస్తున్న అసాగో ఇండస్ట్రీస్ బయో ఇథనాల్ యూనిట్ కు సీఎం జగన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ఎటువంటి కష్టమొచ్చినా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
టెక్ మహీంద్రా గ్రూపు సీఈఓ సిపి గుర్ణని ఇథనాల్ కి సంబంధించి దావోస్ పర్యటనలో చర్చలు జరిగాయని ఆరు నెలలలోనే భూములు ఇవ్వడం దగ్గర నుండి అనుమతులు మంజూరు జరిగాయని తెలిపారు.ఈ ప్లాంట్ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
ఈ ప్లాంట్ ద్వారా బ్రోకెన్ రైస్, ఇథనాల్ తయారు చేస్తారని పేర్కొన్నారు.
ప్లాంటుతో పాటు బై ప్రోడక్ట్ కింద పశువుల దాన, చేపల మేతకు ఉపయోగపడే ప్రోటీన్ ఫుడ్ కూడా అందుబాటులో వస్తుందని పేర్కొన్నారు.
దేశంలో ఈజ్ ఆఫ్ డుయింగ్ కి ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.ఇదే సందర్భంలో ఏలూరు కుడికాలువ నిర్మాణానికి సంబంధించి 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు దీనివల్ల రైతాంగానికి మేలు చేకూరుతుందని సీఎం జగన్ ప్రసంగించారు.







