Jaya Chitra Raghavendra Rao: రాఘవేంద్ర రావు గారితో నాకు గొడవలు పెట్టించారు : జయ చిత్ర

జయ చిత్ర. అలనాటి స్టార్ హీరోయిన్.

 Jaya Chitra Clash With Raghavendra Rao Details, Jaya Chitra, Jaya Chitra Raghave-TeluguStop.com

తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా 70, 80 వ దశకాల్లో చాల పాపులర్ గా కొనసాగింది.దాదాపు 50 ఆమె సినిమా ప్రస్థానం లో సాధించిన మైలు రాళ్ళూ ఎన్నో.

ఆమెకు రాని అవార్డు, దక్కని రివార్డ్ లేదు.సావిత్రి లాంటి స్టార్ హీరోయిన్స్ హావ నడుస్తున్న సమయంలో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్కుతో సినిమాల్లో నటించింది.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారింది.తల్లి పాత్రలో నిండైన చీరకట్టుతో ఆ పాత్రలకే అందం తెచ్చింది.

ఇక తమిళ్ లో ఎక్కువ సినిమాల్లో నటించిన జయ చిత్ర సీరియల్స్ లో కూడా నటించింది.

ఇక జయచిత్ర సినిమా జీవితాల్లో చాల వివాదాలు ఉన్నాయ్.

ఎలాంటి విషయం అయినా కుండా బద్దలు కొట్టేసే జయచిత్ర తనపైన ఎవరైనా గోషిప్స్ రాస్తే ఊరుకునేది కాదు.ఆ జర్నలిస్ట్ ని పిలిపించి మరి వాయించేది.ఇక అలంటి సంఘటనలు ఆమె జీవితంలో ఎన్ని ఉన్నాయ్.ముఖ్యంగా మురళి మోహన్ తో రహస్య పెళ్లి అంటూ రాసిన జర్నలిస్ట్ ని అయితే కొట్టినంత పని చేసింది జయ చిత్ర.

మురళి మోహన్ సైతం నోటీసులు ఇచ్చారు ఆ టైం లో.ఇలాంటి మళ్లి రాస్తే పత్రిక పై పరువు నష్టం దావా వేస్తా అంటూ కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు.ఇక సినిమాల్లో కొన్ని వివాదాలు ఉన్నా కూడా, సీరియల్స్ విషయంలో ఒక వివాదం వచ్చిందట.

Telugu Actressjaya, Actressshiva, Jaya Chitra, Jayachitra, Mangammagari, Murali

ఈ విషయంలో జయ చిత్ర ఎంతో బాధపడ్డారని ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.రాఘవేంద్ర రావు తీసిన మంగమ్మ గారి మనవరాలు సీరియల్ జీ తెలుగు లో ప్రసారం అయ్యి ఘనవిజయం సాధించింది.అయితే ఈ సీరియల్ లో మంగమ్మ పాత్రలో మొదట జయ చిత్రను తీసుకోవాలని అనుకున్నారు.

అందుకోసం జయ చిత్ర అడిగిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వచ్చారు.అయితే ఆమె ఉండటానికి గెస్ట్ హౌస్ ఆరెంజ్ చేయడం లో ఇష్యూ మొదలైంది.

దాంతో ఆమె గురించి రాఘవేంద్ర రావు గారితో చెడుగా చెప్పారట మధ్య వర్తులు.దాంతో ఆమెపై కోపం తో రాఘవేంద్ర రావు నటి శివ పార్వతి ని ఆ రోల్ కోసం తీసుకున్నారు.

ఆలా ఆ విషయంలో తనకు చాల హర్ట్ అయ్యానని జయ చిత్ర చెప్పడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube