టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలె లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాతో అటు విజయ్ దేవరకొండ కెరియర్ లో ఇటు పూరి జగన్నాథ్ కెరీయర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా అనుకున్న విధంగా కలెక్షన్లను సాధించకపోగా సినిమా నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ కి సంబంధించిన వార్త ఒకటి చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే విజయ్ దేవరకొండ తన కెరియర్ ప్రారంభంలో మొదట సైడ్ క్యారెక్టర్స్ పాత్రలు చేస్తూనే హీరోగా నిలదొక్కుకోవడానికి బాగానే ప్రయత్నించారట.
అలా మొదట్లో హీరోల ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో నటించిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని విధంగా భారీ పాపులారిటిని సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ.ఈ సినిమాతో ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయాడు.
ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ రష్మిక మందన నటించిన గీతాగోవిందం సినిమాలో ముందుగా విజయ్ దేవరకొండ కి బదులుగా అల్లు అర్జున్ ని అనుకున్నారట డైరెక్టర్ పరశురాం.ఇక ఆ సినిమా సమయంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాతో మంచి హిట్ సినిమాలు వేసుకున్నాడు అల్లు అర్జున్.
ఇక ఆ సినిమా చేసిన వెంటనే మళ్ళీ వెంటనే గీతగోవిందం లాంటి లవ్ స్టోరీ సినిమా చేస్తే ప్రేక్షకులు ఓకే అంటారో లేదో అని ఆ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ నో చెప్పారట.

ఆ సినిమా స్టోరీ నచ్చడంతో ఆ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చే విధంగా అల్లు అర్జున్ దర్శకుడిని ఒప్పించారట.ఆ తర్వాత ఈ సినిమాకి హీరోగా ఎవరు? సెట్ అవుతారు అని అనుకుంటుఉండగా విజయ్ దేవరకొండ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడు అని ఎవరో చెప్పడంతో వెంటనే విజయని సంప్రదించాడట దర్శకుడు పరశురాం. ఆ తర్వాత విజయ్ ఓకే చెప్పడం ఆ సినిమాలో నటించడం ఆ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించడం అలా జరిగిపోయాయి.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఈ స్టార్ డమ్ అల్లు అర్జున్ వల్లనే వచ్చింది.అల్లు అర్జున్ త్యాగం చేయడం వల్లే విజయ్ హీరో ఈ స్థాయికి చేరుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.