జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ విచారణకు గైర్హాజరు అయ్యారు.అక్రమ గని తవ్వకాల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈడీ జారీ చేసిన నోటీసులను పట్టించుకోని సోరెన్ విచారణకు హాజరు కాలేదు.కేంద్ర ప్రభుత్వం తనపై వ్యతిరేకంగా కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు.
జేఎంఎం ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహాం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలోనే దమ్ముంటే తనను అరెస్ట్ చేయమని సవాల్ విసిరారు.







