మారుతున్న కాలమాన పరిస్ధితులను బట్టి సమాజంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారికి నివాస సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాలకు కష్టమవుతోంది.
అటు రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తుండటంతో పంట పొలాలు, దేవాలయ భూములు వెంచర్‌లుగా మారుతున్నాయి.తాజాగా బ్రిటన్‌లోని కెంట్‌లో ఒకప్పుడు అక్కడి సిక్కు కమ్యూనిటీకి ప్రార్థనా స్థలంగా సేవలందించిన గురుద్వారా భవనం త్వరలో అపార్ట్‌మెంట్‌గా మారనుంది.
గ్రేవ్‌సెండ్‌లోని క్లారెన్స్ ప్లేస్‌లోని గురుద్వారా 2008 వరకు సాడింగ్టన్ స్ట్రీట్‌లోని కొత్త ప్రాంగణానికి మారే వరకు ప్రార్థనా స్థలంగా సిక్కులకు సేవలందించింది.2010 నుంచి ఖాళీగా వున్న ఈ పాత భవనం 2020లో కూల్చివేత నుంచి రక్షించబడింది.స్థానిక కౌన్సిలర్లు దానిని చదును చేసి 19 రెసిడెన్షియల్ ఫ్లాట్‌లను నిర్మించే ప్రణాళికలకు వ్యతిరేకంగా ఓటు వేశారు.అయితే జూలైలో గ్రేవేశం కౌన్సిల్‌కు సమర్పించిన కొత్త దరఖాస్తులో ఆలయాన్ని ఫ్లాట్‌లుగా మార్చే ప్రణాళికలను వివరించారు.
ఈ పూర్వపు గురుద్వారాను 14 రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లుగా మార్చడానికి లైబ్రరీ, సైకిల్, బిన్ స్టోరేజీ సౌకర్యాలను కల్పించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు.పరిసరాల పరిరక్షణతో పాటు వారసత్వ ఆస్తిని సంరక్షించడం ద్వారా అభివృద్ధి చేస్తామని ప్లానింగ్ అప్లికేషన్‌లో పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదన భవిష్యత్ తరాలకు సంతృప్తికరమైన వసతిని అందించడంతో పాటు ఆస్తులను రక్షిస్తుందని దరఖాస్తులో ప్రస్తావించారు.గత బుధవారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు షరతులకు , సెక్షన్ 106 చట్టపరమైన ఒప్పందానికి లోబడి అనుమతి మంజూరు చేయడానికి సర్వీస్ మేనేజర్‌కు విషయాన్ని అప్పగించారు.

ఈ భవనం వాస్తవానికి 1873లో మిల్టన్ కాంగ్రేషనల్ చర్చి, లెక్చర్ హాల్‌గా నిర్మించబడింది.తదనంతర కాలంలో 1968లో ఈ ప్రాంతంలోని సిక్కుల ప్రార్థనా స్థలంగా మారింది.2010లో గ్రేవ్‌సెండ్‌లోని గురునానక్ మార్గ్‌లో కొత్త గురుద్వారాను ప్రారంభించడంతో పాత భవనం శిథిలావస్థకు చేరింది.అధికారిక గణాంకాల ప్రకారం.
బ్రిటన్‌లో 3,36,000 మంది సిక్కులు నివసిస్తున్నారు







