ఈ సంవత్సరం మొదటినుంచి టీమిండియా టి20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.ప్రతి మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద బాధిస్తున్నాడు.
భీకరమైన ఫామ్ లో కొన్న సాగిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ఐసిసి టి20 క్రికెట్ ర్యాంకింగ్లో రెండవ స్థానంలో మొన్నటి వరకు ఉండేవాడు.తాజాగా ఐసీసీ బుధవారం ర్యాంకింగ్స్ ను ప్రకటించగా పాకిస్తాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ వెనక్కి నెట్టి సూర్య కుమార్ యాదవ్ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.
ఇప్పటివరకు రెండో ర్యాంకులో ఉన్న సూర్య నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాపై అర్ధశతకాలు సాధించడంతో అగ్రస్థానానికి చేరుకున్నాడు.దీంతో మొత్తంగా ఈ ఘనత సాధించిన 23వ బ్యాటర్‌గా రికార్డు నమోదు చేశాడు.
భారత్ జట్టు నుంచి రెండో క్రికెటర్ కావడం సూర్య కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనతను సాధించాడు.ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐసీసీ t20 ర్యాంకింగ్ స్లో పదో స్థానంలో ఉన్నాడు.
పాక్ ఓపెనర్ రిజ్వాన్, న్యూజిలాండ్ బ్యాటర్ దెవోయ్ కాన్వే రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు.ఈ మెగా టోర్నీలో శతకాలు చేసిన గ్లెన్ ఫిలిప్స్, న్యూజిలాండ్ రిలీ రోసో,(దక్షిణాఫ్రికా) టాప్-10లో దూసుకొచ్చారు.
ఇంకా చెప్పాలంటే టి20 బౌలింగ్ విషయంలో టాప్ టెన్ లో భారత్ నుంచి ఒక్క బౌలర్ కూడా లేడు.భువనేశ్వర్ కుమార్ మొన్నటి వరకు టాప్ టెన్ లో ఉన్న ఆస్థానాన్ని కోల్పోయి ప్రస్తుతం 11 వ స్థానంలో కొనసాగుతున్నాడు. రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్), వహిందు హసరంగ (శ్రీలంక) తొలి రెండు స్థానాలలో ఉన్నారు.ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్ ఇండియా నుంచి హార్దిక్ పాండ్య మూడో ర్యాంకులో ఉన్నాడు.
షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), మొహమ్మద్ నబీ (అఫ్గానిస్థాన్) మొదటి రెండు ర్యాంకుల్లో ఉన్నారు.