తమిళ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కార్తీ తమిళ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
హీరో కార్తీక్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.అంతేకాకుండా కార్తీక్ నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా వరుసగా విషయాలు అందుకుంటున్నాయి.
ఇది ఇలా ఉంటే హీరో కార్తీ నటించిన తాజా చిత్రం సర్దార్. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
అంతేకాకుండా కార్తీ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది.
కాగా స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
అంతే కాకుండా ఈ సినిమా నిర్మాతకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.కాగా ఈ సినిమాకు ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈ సినిమా నిర్మాత ఎస్ లక్ష్మణ్ కుమార్ తాజాగా దర్శకుడు పీఎస్ మిత్రన్ కు ఒక కారుని బహుమతిగా ఇచ్చాడు.సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా కారుని గిఫ్ట్ గా ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు లక్ష్మణ్ కుమార్.
కొత్త కారు కీస్ ని హీరో కార్తీ చేతులమీదుగా డైరెక్టర్ కు అందించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా దీపావళి కానుకగా ఇటీవల ఈ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ సినిమాకు సీక్వెల్ ని కూడా ప్రకటించేసింది చిత్ర బృందం.
ఆ సినిమాకు సర్దార్ 2 గా కూడా టైటిల్ ను ఖరారు చేసింది.సర్దార్ 2 సినిమాలో కూడా సర్దార్ కి పనిచేసిన బృందమే పనిచేస్తుంది అని తెలిపారు.
కాగా ప్రస్తుతం సర్దార్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.







