దిగ్గజ టెలికాం సంస్థ ఎయిల్‍టెల్ 5జీ సేవలను ఇండియాలోని 8 మెట్రో నగరాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే.అయితే కమర్షియల్ 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చి నెలరోజులు కూడా ఇంకా గడవలేదు.
కాగా ఇప్పటికే ఈ కంపెనీ 10 లక్షల మంది 5జీ కస్టమర్స్‌ను సంపాదించింది.వారాల సమయంలోనే 10 లక్షల మంది యూజర్లు ఎయిర్‌టెల్ 5జీ నెట్‍వర్క్‌లో చేరడం అంటే చాలా పెద్ద విషయమే.
ప్రస్తుతానికి యూజర్లు ఎయిల్‍టెల్ 5జీ సేవలను హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, సిలిగుడి, నాగ్‍పూర్, వారణాసి వంటి ఎనిమిది నగరాల్లో పొందొచ్చు.
డిసెంబర్ 2024 నాటికి ఈ సేవలు పూర్తి స్థాయిలో అందరికి అందుబాటులోకి వస్తాయి.
ప్రస్తుతానిక ఈ సేవలకు ఫుల్ డిమాండ్ ఉంది.చాలామంది ప్రజలు 5జీ మొబైల్స్ కూడా కొనుగోలు చేస్తున్నారు.
తమ 5జీ నెట్‍వర్క్ ను 4జీ సిమ్‍కార్డులతోనే పొందవచ్చు అని కంపెనీ తెలిపింది.దీనివల్ల 5జీ కోసం యూజర్లు కొత్త సిమ్‍కార్డ్ తీసుకోవాల్సిన పనే లేదు.
మరో బెనిఫిట్ ఏంటంటే, 4జీ ప్లాన్‍లతో 5జీ సేవలు ప్రస్తుతానికి పొందవచ్చు.

ఐఫోన్స్ కాకుండా మిగిలిన కంపెనీల 5జీ మొబైల్స్ ఈనెలలో ఎయిర్‌టెల్ 5జీ నెట్‍వర్క్‌కు సపోర్ట్ అందించనున్నాయి.ఈనెల 15వ తేదీలోగా 5జీ మొబైళ్లకు ఓటీఏ అప్‍డేట్స్ కూడా రానున్నాయి.శామ్‌సంగ్ నుంచి 27 5జీ మొబైల్ మోడల్స్ ఇండియాలో రిలీజ్ కాగా వాటిలో 16 మోడల్‌లు ఇప్పటికే ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తున్నాయి.
వన్‌ప్లస్ మొత్తం 17 మోడల్స్, వివో మొత్తం 34 మోడల్స్, రియల్‌మీ మొత్తం 34 మోడల్స్, షియోమీ మొత్తం 33 మోడల్‌లు, ఒప్పో మొత్తం 14 మోడల్స్ 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తున్నాయి.భారతదేశంలో తమ యూజర్లు 5జీ సేవలు పొందేలా ఐఫోన్లకు అప్‍డేట్‍ను డిసెంబర్ నుంచి సెండ్ చేస్తామని యాపిల్ హామీ ఇచ్చింది.







