ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా తాజాగా నోకియా జీ60 పేరుతో సరికొత్త 5జీ ఫోన్‌ను ఇండియాలో పరిచయం చేసింది.నోకియా జీ60 ధరను రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది.ఇది 6జీబీ+ 128జీబీ వేరియంట్‌గా అందుబాటులోకి వచ్చింది.
నవంబర్ 8 నుంచి ఇండియాలో ఈ ఫోన్ సేల్స్ ప్రారంభమవుతాయి.నోకియా జీ60 బ్లాక్, వైట్ స్నో కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అయ్యింది.ఈ కొత్త మొబైల్ 6.58-అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్, 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, డిస్‌ప్లే నాచ్‌తో వస్తుంది.ఈ మొబైల్‌కి 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 3 ఏళ్ల పాటు మంత్లీ సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని నోకియా వెల్లడించింది.
ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో వస్తుంది.ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని ఇచ్చారు.
ఫోన్ ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది.నోకియా 20W ఛార్జింగ్ స్పీడ్‌కు మద్దతు ఇచ్చే 4500ఎంఏహెచ్ బ్యాటరీతో ఫోన్‌ను ప్యాక్ చేసింది.
ఫోన్ 5Gకి మద్దతు ఇస్తుంది కానీ డివైజ్‌లో ఉన్న బ్యాండ్స్ ఏంటనేవి తెలియాల్సి ఉంది.ఈ మొబైల్‌తో రూ.3,599 విలువైన నోకియా వైర్డ్ బడ్స్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

ఇది స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP52 రేటింగ్‌తో వచ్చింది.సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.5జీ ఫోన్ కొనాలనుకునే వారికి, అది కూడా నోకియా బ్రాండ్ నుంచి పొందాలనుకునే వారికి ఈ మొబైల్ ఒక బెస్ట్ ఛాయిస్ అవుతుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.







